‘సైరా’ షూటింగ్లో పాల్గొననున్న తమన్నా

‘సైరా’ షూటింగ్లో పాల్గొననున్న తమన్నా

Published on May 10, 2018 3:59 PM IST

మెగాస్టార్ చిరాంజీవితో నటించాలనే మిల్కీ బ్యూటీ తమన్నా కల త్వరలోనే నేరవేరనుంది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ‘సైరా’ సినిమాలో ఒక వారియర్ పాత్రకుగాను దర్శక నిర్మాతలు తమన్నాను ఎంపికచేసిన సంగతి తెలిసిందే. వచ్చే వారం జరగనున్న షూటింగ్లో తమన్నా తన తాలూకు షూటింగ్లో పాల్గొననుంది.

హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ షూట్ జరగనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు రామ్ చరణ్. ఈ చిత్రంలో కథానాయకిగా నయనతార నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, రవి కిషన్ వంటి ఇతర తారలు కూడ ఈ చిత్రంలో పాలు పంచుకుంటున్నాను.

తాజా వార్తలు