షురూ అయిన నాగ్-తమన్నా-కార్తీల రొమాన్స్

షురూ అయిన నాగ్-తమన్నా-కార్తీల రొమాన్స్

Published on Apr 10, 2015 12:02 PM IST

karthi
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ మల్టీ స్టారర్ మూవీ మొదలైంది. ఈ మల్టీ స్టారర్ లో టాలీవుడ్ కింగ్ నాగార్జున – కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంచనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ఫ్రెష్ షెడ్యూల్ నిన్నటి నుంచి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది. ఈ సినిమాలో మొదట శృతి హాసన్ ని హీరోయిన్ గా అనుకున్నా తనకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలన ఈ సినిమా నుండి తప్పుకుంది. దాంతో తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.

ఫస్ట్ షెడ్యూల్ లో నాగార్జున, కార్తీ, తమన్నాలు షూటింగ్ లో పాల్గొంటున్నారు. వంశీ పైడిపల్లి నాగార్జున – కార్తీల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ని రెడీ చేసాడు. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగార్జున, కార్తీ ఇద్దరూ తమన్నాతో రొమాన్స్ చేయనున్నారు. పివిపి నిర్మించనున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తాడు. ఈ సినిమాలో రొమాంటిక్ అంశాలతో పాటు ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఫుల్ గా ఉంటాయని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు