ఇంతకీ ఆ రెండు దెయ్యాలు ఎవరూ ?

Published on Apr 16, 2019 8:07 pm IST

ప్రభుదేవా, తమన్నా హీరోయిన్స్ గా తెరకెక్కిన అభినేత్రి 2 చిత్రం టీజర్ ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అభినేత్రి 1లో దెయ్యం తమన్నాను ఆవహిస్తే… అభినేత్రి 2 లో మాత్రం దెయ్యం ప్రభుదేవాను ఆవహించింది. మొత్తానికి హర్రర్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ సీక్వల్ హిట్ అవుతుందేమో చూడాలి.

ఇక ఈ చిత్రంలో తమన్నాతో పాటు మరో యంగ్ హీరోయిన్ నందితా శ్వేత కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది. టీజర్ లో ఒకటి కాదు రెండు దెయ్యాలు అనే డైలాగు బాగా వినిపించింది. బహుశా నందితా శ్వేతని కూడా దెయ్యం ఆవహిస్తుందేమో..! ఎలాగూ నందితా శ్వేత దెయ్యం సినిమాల్లోనే ఎక్కువ నటించింది కదా.

తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రం మే 1వ తేదీన రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :