మరో అతిధి పాత్రలో మిల్క్ బ్యూటీ

మరో అతిధి పాత్రలో మిల్క్ బ్యూటీ

Published on May 4, 2014 10:30 AM IST

tamanna
సౌత్ లో బాగా క్రేజ్ ఉన్న మిల్క్ బ్యూటీ తమన్నా వరుసగా అతిధి పాత్రలకు సైన్ చేస్తోంది. ఇటీవలే వివి వినాయక్ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించిన ఈ భామ ఇప్పుడు మరో తమిళ సినిమాలో అతిధి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తమిళ హీరో ఉధయనిధి స్టాలిన్, నయనతార, సంతానం ప్రధాన పాత్రల్లో ‘నన్బెండా’ సినిమా తెరకెక్కుతోంది. రాజేష్ దగ్గర అసోషియేట్ గా పనిచేసిన జగదీశ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో తమన్నా ఓ అతిధి పాత్రలో కనిపించనుంది. దీనికి సంబందించిన షూటింగ్ కూడా తమన్నా ఇటీవలే పూర్తి చేసిందని సమాచారం. ఇది కాకుండా రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ‘బాస్ ఎన్గిరన్ భాష్కరన్’ సీక్వెల్ లో నటించడానికి సైన్ చేసింది.

టాప్ హీరోయిన్ అయిన తమన్నా ఇలా అతిధి పాత్రలు చేయడం ఆసక్తి కరమైన విషయం అయితే ఈ సినిమాల తర్వాత తనకు ఇలాంటి ఆఫర్స్ ఎక్కువగా వస్తాయని కూడా ఆశించవచ్చు . తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘ఆగడు’, ‘బాహుబలి’ సినిమాల్లో నటిస్తోంది.

తాజా వార్తలు