ఆ రెండు విషయాలకు నో చెప్పిన తమన్నా..!

ఆ రెండు విషయాలకు నో చెప్పిన తమన్నా..!

Published on Mar 18, 2013 4:00 AM IST

Tamanna-

గ్లామర్ విషయంలో మిల్క్ బ్యూటీ తమన్నా కిరీటంలేని క్వీన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు. ‘బద్రినాథ్’, ‘రచ్చ’ సినిమాల్లో ఆమె చేసిన డాన్సులకు మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె హిందీలో నటించిన ‘హిమ్మత్ వాలా’ సినిమా మార్చి చివర్లో విడుదలకి సిద్దమవుతోంది. తెలుగు, తమిళ సినిమాలను పక్కన పెడితే – బాలీవుడ్లో లిప్ కిస్, బికినీ సీన్ వెయ్యడం చాలా కామన్ విషయం. ఇప్పటికే చాలామంది టాప్ హీరోయిన్స్ అక్కడ ఇలాంటి సీన్స్ లో తరపై కనిపించారు. తమన్నాని ఇదే ప్రశ్ని అడిగితే ఆమె సున్నితంగా తెరపై ఇలాంటివి చేయను అని చెప్పింది.

‘బాలీవుడ్ అయినా , సౌత్ అయినా నేను బికినీ వేసుకొను అలాగే లిప్ కిస్ సీన్లలో నటించను. స్వతహాగా నాకంటూ కొన్ని బౌండరీలు ఉన్నాయి. నేను వాటిని క్రాస్ చెయ్యను. ఆ నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పరవాలేదని’ ఆమె అన్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగు సినిమా ‘వెట్టై’ రీమేక్లో నటిస్తోంది, అలాగే అజిత్ సరసన ఓ తమిళ సినిమాలో నటించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు