బాలీవుడ్‌ను వదలేది లేదంటున్న మిల్కీ బ్యూటీ

Published on Jun 28, 2019 11:00 am IST

దక్షిణాదిన అవకాశాలు మెండుగా ఉన్నా తమన్నా మాత్రం బాలీవుడ్ పరిశ్రమపై ఎక్కువ దృష్టి పెడుతోంది. ఇప్పటికే హిందీలో ‘హిమ్మత్ వాలా, తుటాక్ తుటాక్ తూటియా, ఖామోషి’ సినిమాలతో సందడి చేసిన ఈమె తాజాగా ఇంకో కొత్త సినిమాకు కూడా సైన్ చేసింది. ఈ చిత్రంలో స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన ఆమె కథానాయకిగా నటించనుంది. ఈ చిత్రానికి ‘బోలె చుడియన్’ అనే టైటిల్ నిర్ణయించారు.

ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ సైతం ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరుడు షమాస్ నవాబ్ సిద్దిఖీ డైరెక్ట్ చేయనున్నాడు. ఇకపోతే తమన్నా తెలుగులో ‘సైరా, రాజుగారి గది 3’ వంటి చిత్రాలతో పాటు తమిళంలో ఇంకో రెండు సినిమాల్లో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More