తమన్నాతో చిందులేస్తున్న యంగ్ హీరో

Tamanna_sreenu

ప్రస్తుతం సౌత్ ఇండియాలో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ షెడ్యూల్స్ గడుపుతూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా ఉన్న భామ మిల్క్ బ్యూటీ తమన్నా. హీరోయిన్ గా కొనసాగుతూనే మంచి కాంబినేషన్ అవడం వలన వివి వినాయక్ – బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా మరోసారి తమన్నా బెల్లంకొండ శ్రీనివాస్ సెకండ్ మూవీలో కూడా ఓ సాంగ్ చేయడానికి ఒప్పుకుందని ఇదివరకే తెలుయజేశాం. ప్రస్తుతం తమన్నా ఆ స్పెషల్ సాంగ్ షూట్ ని ఫినిష్ చేసే పనిలో ఉంది.

గత రెండు రోజులుగా అన్నపూర్ణ 7 ఎకర్స్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లో తమన్నా – బెల్లంకొండ శ్రీనివాస్ పై పాటని షూట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ షూట్ ని ఫినిష్ చేస్తారు. ఈ సాంగ్ కోసం తమన్నా భారీ అమౌంట్ నే అందుకుందని సమాచారం. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోనారిక బడోరియా హీరోయిన్ గా కనిపించనుంది. తమిళంలో హిట్ అయిన సుందర పాండ్యన్ సినిమాకి ఇది రీమేక్. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.

Exit mobile version