చిరు సినిమాలో మిల్కీబ్యూటీ కన్ఫర్మ్ !

16th, April 2018 - 11:19:54 AM


చిరు 151వ సినిమా ‘సైరా’లో మరొక స్టార్ నటీమణి తమన్నా కూడ నటించనుంది. గత కొద్దిరోజులుగా తమన్నా ఈ సినిమాలో చేస్తుందని కొందరు చేయడంలేదని ఇంకొందరు అంటుండగా ఎట్టకేలకు ఆమె ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు తేలింది. ఈ విషయాన్నే కన్ఫర్మ్ చేసిన తమన్నా చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లు తనకు ఎంతో ఇష్టమైన నటులని వారితో కలిసి నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నానని సంబరపడిపోయారట.

అంతేగాక తన పాత్ర తాలూకు వివరాల్ని తెలుసుకునేందుకు రీసెర్చ్ కూడ మొదలుపెట్టానని, ఆన్ లైన్ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించానని చెప్పుకొచ్చారట తమన్నా. అయితే ఇంతకీ తమన్నా కథలో ఏ పాత్ర చేయనుంది, అదెలా ఉండబోతోంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు.