సైరా తో ఆమె కల నెరవేరిందట…!

Published on Aug 20, 2019 8:17 am IST

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందారు. దాదాపు ఈ భామ టాలీవుడ్ అందరు స్టార్ హీరోలతో కలిసి నటిచడం జరిగింది. ఐతే మెగాస్టార్ చిరు సరసన నటించే అవకాశం మాత్రం ఈ భామకు దక్కలేదు. అందుకు ఆమె చాలా బాధపడేవారట. ఐతే సైరా మూవీతో చిరు మూవీలో నటించాలనే తన కోరిక తీరిపోయిందని సంబరపడుతుంది తమన్నా. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్నీ వెల్లడించారు.

హీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీలో తమన్నా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీ నయన తార చిరు సరసన నటిస్తుండగా, అమితాబ్, జగపతిబాబు,విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. నేడు టీజర్ విడుదల కనునున్న ఈ మూవీ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమౌతోంది.

సంబంధిత సమాచారం :