కృష్ణవంశి దర్శకత్వంలో తమన్నా..?

Tamanna

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశి దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుందనే వార్త గత రెండు మూడు రోజుల నుండి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. తమన్నా అభిమానులకు ఈ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది.

అంతా కొత్తవారితో కృష్ణవంశి ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని 123తెలుగు.కామ్ కొన్ని రోజుల కిందట తెలియజేసింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు తమన్నాను సంప్రదించినట్టు సమాచారం. దిల్ రాజు, ప్రకాష్ రాజ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది.

Exit mobile version