‘సైరా’లో తమన్నా.. నిజమేనా ?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘సైరా’ హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు నయనతార, సుదీప్, జగపతిబాబు వంటి స్టార్ నటీ నటులు నటిస్తుండగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ తమన్నా కూడ వీళ్ళతో కలిసి పనిచేయనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

దర్శక నిర్మాతలు కథలో ఒక కీలకమైన పాత్ర కోసం తమన్నా అయితే బాగుంటుందని, ఆమెనే ఆ పాత్ర కోసం తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఈ ఊహాగానాలు నిజమా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇకపోతే తమన్నా ప్రస్తుతం ‘క్వీన్’ రీమేక్లో, కళ్యాణ్ రామ్ యొక్క ‘నా నువ్వే’ సినిమాల్లో కథానాయిక పాత్రలు చేస్తున్నారు.