మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు,తమిళ హిందీ భాషలలో కలిపి దాదాపు అరడజను చిత్రాలలో నటిస్తుంది. ఆమె నటించిన సైరా నరసింహారెడ్డి ఇంకా రెండు రోజులలో విడుదల కానుంది. దీనితో ఈ అమ్మడు సైరా ప్రొమోషన్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఒకపక్క భారీ చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంటూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తుంది తమన్నా. జీవ హీరోగా వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ రంగం చిత్రంలో మొదటిసారి స్పెషల్ సాంగ్ లో కనిపించిన తమన్నా ఇప్పటివరకు తెలుగు తమిళ, కన్నడ చిత్రాలలో ఆరు ఐటమ్స్ సాంగ్స్ లో కనిపించారు.
ఐతే వాటిలో ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ ఒకటి. ఈ చిత్రంలో స్వింగ్ జరా సాంగ్ లో తమన్నా బెల్లీ హొయలతో, సెక్సీ స్టెప్స్ తో హీటెక్కించింది. కాగా మహేష్ తాజా మూవీ సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో కూడా తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారు. దేవిశ్రీ స్వరపరిచిన ఒక మాస్ బీట్ సాంగ్ లో మహేష్, తమన్నా ఓ రేంజ్ స్టెప్స్ తో అలరిస్తారని సమాచారం. ఐటమ్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ సరిలేరు నీకెవ్వరూ చిత్రంలోని ఈ ఐటెం సాంగ్ కోసం మాస్ కి పూనకాలు వచ్చేలా ట్రెండీ బీట్స్ ఇస్తాడు అనడంలో సందేహం లేదు.


