‘అల్లుడు శ్రీను’ సినిమాలో తమన్నా ఒక హాట్ ఐటెం సాంగ్ లో అందాలు ఆరబోసిన సంగతి తెలిసినదే . ఇప్పుడు ఆ పాట యమ క్రేజ్ ని సంతరించుకుంటుంది. ఈ సినిమాలో పాటలకు వేసిన భారీ సెట్ లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తమన్నా చేరిక సినిమాకు బలం చేకూరుస్తుందని చిత్రబృందం విశ్వాసం
తమన్నా డ్యాన్స్ లు, మెరుమెట్లు గొలిపే కాస్ట్యుంలు బి, సి సెంటర్ ల ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని సమాచారం. ఈ పాటకి దేవి శ్రీప్రసాద్ అందించిన మాస్ బాణీకూడా అదనపు హంగుగా నిలిచింది
బెల్లంకొండ శ్రీనివాస్ మరియు సమంతా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు వి.వి వినాయక్ దర్శకుడు


