
ధనుష్ ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన మారి సినిమాకి మిశ్రమ స్పందనలు అందుతున్నాయి. ప్రస్తుతం ధనుష్ వి.ఐ.పి 2 షూటింగ్ లో బిజీగా వున్నాడు, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ ఏడాదిలోనే విడుదలకు చిత్ర నిర్మాత ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కాక ధనుష్ మరో తమిళ చిత్రానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం.
వాడా చెన్నై పేరుతొ తెరకెక్కనున్న ఈ సినిమా ధనుష్ మూడు విభిన్న పాత్రలలో అలరించనున్నాడు. దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని ఘనంగా తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు.