ఆత్మహత్య చేసుకున్న యంగ్ హీరోయిన్ !

riya mikka 06
తమిళ యంగ్ హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్న దురదృష్ట సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..తమిళ సినీ పరిశ్రమలో ఈ మధ్యే కాస్త గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోయిన్ రియా మిక్క బుధవారం వలసరవాక్కంలోని తన హౌస్ లో ఫ్యాన్‌ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

రియా మిక్క నాలుగు నెలలుగా తన సోదరుడు ప్రకాష్ తో అద్దె ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే ఆమె కొంత కాలంగా డిప్రెషన్‌ కి గురవుతున్నారని.. ఆ కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

కాగా ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్నారు.

Exit mobile version