అదే జరిగితే ‘బిగ్ బాస్-3’ మజా అంటా మటాషే….!

అదే జరిగితే ‘బిగ్ బాస్-3’ మజా అంటా మటాషే….!

Published on Jun 20, 2019 3:53 PM IST

భాషాభేదాలు లేకుండా నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అని చోట్లా బిగ్ బాస్ సిరీస్లు విజయం సాధిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో గల ప్రధానమైన తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో బిగ్ బాస్ ప్రసారం అవుతుంది. ఐతే ఈ రియాలిటీ షో ఎంత విజయం సాధిచిందో అంతే స్థాయిలో వివాదాలు కూడా తలెత్తుతున్నాయి.

కాగా ఈనెల 23నుండి ప్రసారం కానున్న తమిళ ‘బిగ్ బాస్ 3’ కి వ్యతిరేకంగా మద్రాస్ హై కోర్ట్ లో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ షోలో పాల్గొంటున్న సభ్యుల ప్రవర్తనతో పాటు,వాళ్ళు ధరించే బట్టలు,మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగులు టీవీలలో వీక్షించే కుటుంబ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేవిధంగా ఉండటంతో పాటు, యువతను పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయని, కావున ఈ రియాలిటీ షో ప్రదర్శనకు ముందు సెన్సార్ సభ్యుల అనుమతి పొందేలా చూడాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనితో కమల హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ 3 ప్రసారం కొంచెం సందిగ్ధంలో పడింది. ‘బిగ్ బాస్ 3’ని తమిళంలో ప్రసారం చేస్తున్న విజయ్ టీవీ కోర్ట్ ఏమి తీర్పు ఇస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ సెన్సార్ చేశాకే ప్రసారం చేయాలని కోర్ట్ కనుక తీర్పు ఇస్తే మాత్రం బిగ్ బాస్ షో నుండి ప్రేక్షకులు ఆశించే ఆ స్పైసీనెస్ మొత్తం పోయినట్లే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు