డూప్ లేకుండా స్టంట్ చేసి ప్రమాదానికి గురైన హీరో

డూప్ లేకుండా స్టంట్ చేసి ప్రమాదానికి గురైన హీరో

Published on Dec 29, 2020 7:22 PM IST

తమిళ హీరోలు విశాల్, ఆర్యలు కలిసి ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా విశాల్, ఆర్యలతో ఒక హెవీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు టీమ్. ఇద్దరు హీరోలు సీన్లో పాల్గొంటున్నారు. ఎలాంటి డూప్ లేకుండానే షూటింగ్ చేస్తున్నారు ఇద్దరూ. ఈ క్రమంలో ఆర్య ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఆయనకు పెద్ద గాయమే అయినట్టు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే టీమ్ ఆర్యను దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆర్య తిరిగి సెట్లోకి అడుగుపెట్టారట. మొదలుపెట్టిన యాక్షన్ సీన్ కంప్లీట్ చేశాకే ప్యాకప్ చెప్పారట. వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఎనిమీ’ అనే టైటిల్ నిర్ణయించారు. గతంలో ఆర్య, విశాల్ కలిసి బాల దర్శకత్వంలో చేసిన ‘అవన్ ఇవన్’ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ‘ఎనిమీ’ మీద తమిళ సినీ జనంలో మంచి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు