‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా మరో హీరో నటించబోతున్నట్లు సమాచారం. తమిళ హీరో శింబును విలన్ గా తీసుకోబోతున్నారట. ఇక కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో ఓ డిఫరెంట్ విలన్ రోల్ లో నటించబోతున్నాడని తెలుస్తోంది.
తన మిత్రుడు డైరెక్టర్ తివిక్రమ్ చొరవతో ఎన్టీఆర్ కొత్త సినిమాలో సునీల్ కి విలన్ గా అవకాశం వచ్చిందట. మరి సునీల్ విలన్ గా నిజంగానే నటిస్తున్నాడా లేడా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.


