అరడజను మంది తెలుగు హీరోలతో పోటీపడనున్న తమిళ హీరో

Published on Oct 27, 2020 8:00 am IST

లాక్ డౌన్ కారణంగా విడుదల కాకుండా ఆగిపోయిన తెలుగు సినిమాలు చాలా వరకు సంక్రాంతి పండుగను టార్గెట్ చేశాయి. పండుగ సీజన్లో థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్వపు పరిస్థితులు మళ్లీ వస్తాయనే ఆశతో హీరోలు, దర్శక నిర్మాతలు కొంచెం ఆలస్యమైనా ఆ సీజన్లోనే తమ సినిమాలను విడుదల చేయాలని సంకల్పించారు. అలా సంక్రాంతి బరిలో ‘క్రాక్’ సినిమాతో రవితేజ, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో అక్కినేని అఖిల్, ‘రెడ్’ చిత్రంతో రామ్, ‘సోలో బ్రతుకే సో బెటరు’తో సాయి తేజ్, ‘అరణ్య’తో రానా, ‘రంగ్ దే’ చిత్రంతో నితిన్ పోటీపడనున్నారు.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, ‘కెజీఎఫ్ 2’ లాంటి భారీ చిత్రాలు కూడ సంక్రాంతి సీజన్లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ పోటీ నడుమ తమిళ హీరో శింబు కూడ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన కొత్త చిత్రం ‘ఈశ్వరన్’ తమిళంతో పాటు తెలుగులో ‘ఈశ్వరుడు’ పేరుతో సంక్రాంతికి విడుదల కానుంది. ‘నా పేరు శివ’ ఫేమ్ సుసీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మాధవ్ మీడియా బ్యానర్ నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి అరడజను మందికి పైగా తెలుగు హీరోలతో పోటీపడి శింబు ఎంతలా ఆకట్టుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More