తమిళ ఇండస్ట్రీ 4 వేల కోట్లు నష్టపోయిందట !

తమిళ ఇండస్ట్రీ 4 వేల కోట్లు నష్టపోయిందట !

Published on Jun 4, 2021 10:09 PM IST

గత ఏడాది మొదలైన లాక్ డౌన్ నుండి ఇప్పటివరకు అన్ని భాషల చిత్ర పరిశ్రమలు నత్త నడకనే నడుస్తున్నాయి. ఏ ఒక్క పరిశ్రమా పూర్తిగా కొలుకోలేకపోతోంది. ఒక్క తెలుగు ఇండస్ట్రీ మాత్రమే మిగతా ఇండస్ట్రీలతో పోల్చితే కాస్తో కూస్తో పుంజుకుని గాడినపడినట్టు అనిపించింది. ఇక తమిళ పరిశ్రమ అయితే మరీ కుంటుబడిపోయింది. తమిళనాట కరోనా ప్రభావం మరీ ఎక్కువగా ఉండటంతో ఏడాదిన్నరగా ఇండస్ట్రీ కోలుకోనేలేదు. మధ్యలో అడపాదడపా షూటింగ్స్ మొదలైనా కొన్నిరోజులకే అవి కూడ ఆగిపోయాయి. అంతేకాదు థియేటర్ రంగమైతే మరీ కుంటుబడిపోయింది.

పూర్తైన సినిమాలు చాలావరకు ల్యాబ్స్ కే పరిమితమయ్యాయి. కొన్ని చిత్రాలు మాత్రమే ఓటీటీల్లోకి వచ్చాయి. ఈ పరిణామాలతో ఇండస్ట్రీలోని కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పరిశ్రమకు దాదాపు 4 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 60 వేల మంది కార్మికుల జీవితాలు తలకిందులయ్యాయని దక్షిణ భారత సినీ నిర్మాణ కార్మికుల మండలి అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి అంటున్నారు. అంతేకాదు లాక్‌ డౌన్‌ ముగిసిన తర్వాత కనీసం ఆరు నెలల పాటు అన్ని రకాల పన్నుల్లో రాయితీ ఇవ్వాలని, షూటింగ్స్ మొదలవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు ప్రభుత్వం, చిత్ర పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు కలిసి సినీ కార్మికుల జీవనోపాధికి అవసరమైన సహాయాన్ని చేయాలని కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు