ఆస్కార్ బరిలో నిలిచిన తమిళ చిత్రం ‘కూళంగల్’..!

Published on Oct 23, 2021 10:07 pm IST


హీరోయిన్ నయనతార, డైరెక్టర్‌ విఘ్నేష్ శివన్ సంయుక్తంగా రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన తమిళ చిత్రం ‘కూజాంగల్’ అస్కార్ అవార్డుకు ఎంపికయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్‌ నామినేషన్‌కు వెళ్లే మొత్తం 14 సినిమాలను వీక్షించి అందులో ‘కూజాంగల్’ సినిమాను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. మార్చి 2022న లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే 94వ ఆస్కార్‌ పోటీలకు భారత్ నుంచి ఈ సినిమా బరిలో నిలవనుంది.

అయితే ‘కూళంగల్‌’ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచిందన్న విషయం తెలియగానే విఘ్నేశ్‌ శివన్‌ సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై విఘ్నేశ్‌ శివన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ “అండ్‌ ది ఆస్కార్స్‌ గోస్‌ టూ”.. అనే పదం వినేందుకు చాలా ఆనందంగా ఉందని, ఆస్కార్‌ గెలుచుకునేందుకు మరో రెండు అడుగుల దూరంలో ఉ‍న్నామని అన్నాడు.

సంబంధిత సమాచారం :

More