‘సర్కార్’ కు నోటీసులు ఇచ్చిన తమిళనాడు ప్రజా ఆరోగ్య శాఖ !

‘సర్కార్’ కు నోటీసులు ఇచ్చిన తమిళనాడు ప్రజా ఆరోగ్య శాఖ !

Published on Jul 6, 2018 2:00 PM IST

Sarkar4

ఇళయదళపతి విజయ్ నటిస్తున్న 62 వ చిత్రం ‘సర్కార్ ‘ ఫస్ట్ లుక్ పోస్టర్ ఫై ఇటీవల విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు తమిళనాడు ప్రజా ఆరోగ్య శాఖ ఒక అడుగు ముందుకేసి ఏకంగా విజయ్ కి నోటీసులు పంపించింది .ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో విజయ్ సిగరెట్ తాగుతూ ఉండడమే అందుకు కారణం.

తమిళ నాడులో రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో అభిమానులను కలిగిన నటుడు ఇలా దూమపానం ను ప్రోత్సహించడం ఏంటని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ నోటీసుల విషయంలో విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇలా విడుదలకు ముందే ఆయన నటించిన చిత్రాలు వివాదాల్లో చిక్కుకోవడం సర్వ సాధారణంగా మారింది. మురుగదాస్ తెరకెక్కిస్తున్నఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది . సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు