తమిళంలో రీమేక్ కానున్న ‘రాజుగారి గది’?

Raju-Gari-kadha
‘రాజుగారి గది’.. ఓంకార్ దర్శకత్వంలో రూపొంది ఈ దసరాకు విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా. లో బడ్జెట్‌లో తెరకెక్కి చిన్న సినిమాగా విడుదలైన రాజుగారి గది, బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనాన్నే నమోదు చేసింది. ఇప్పటికీ స్టడీగా కొనసాగుతూ నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన ఈ సినిమా త్వరలోనే తమిళంలోనూ రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. రాజుగారి గది సినిమా నిర్మాతల్లో ఒకరైన దివాకర్ తమిళ రీమేక్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

తమిళంలో హర్రర్ కామెడీకి సూపర్ క్రేజ్ కనిపిస్తోన్న నేపథ్యంలో రాజుగారి గది కూడా ఆ కోవలో మంచి హిట్ కొడుతుందని టీమ్ భావిస్తోంది. ఈమధ్యే తమిళంలో కాంచన 2, మాయ, డెమెంటో కాలనీ తదితర హర్రర్ సినిమాలు బాక్సాఫ్హీస్ వద్ద సంచలనం సృష్టించడంతో రాజుగారి గది సినిమాకూ రీమేక్ ద్వారా మంచి క్రేజ్ కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమిళ రీమేక్ కనుక నిజంగానే సెట్ అయితే దానికీ ఓం‌కారే దర్శకత్వం వహిస్తారా అన్నది తెలియాలి.

Exit mobile version