సినిమా సినిమాకి తన మార్కెట్ ని పెంచుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ రానున్నాయి. ఇటీవలే తమిళంలో ఓ థ్రిల్లర్ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసిన సందీప్ కిషన్ ప్రస్తుతం తెలుగులో ‘ఒక అమ్మాయితో తప్ప’ సినిమా చేస్తూనే సివి కుమార్ డైరెక్షన్ లో ఓ ద్విభాషా సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ కి కూడా సైన్ చేసాడు. ఇదిలా ఉండగా రీసెంట్ గా సందీప్ కిషన్ 2013లో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘నేరం’ అనే సినిమా రీమేక్ కి సైన్ చేసాడు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ క్రేజీ స్టార్ ని సెలక్ట్ చేసారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే.. ఆ తమిళ స్టార్ ఒరిజినల్ తమిళ వెర్షన్ లో అదే రోల్ చేసాడు.. అతనే బాబీ సింహా. నేరం సినిమాతో తమిళంలో స్టార్ అయిపోయిన బాబీ సింహా తెలుగులో కూడా విలన్ రోల్ పోషించనున్నాడు. ఒరిజినల్ వెర్షన్లో వట్టి రాజ్ అనే పాత్రలో నటించిన బాబీ సింహా అయితేనే ఆ పాత్రని పర్ఫెక్ట్ గా రీ క్రియేట్ చేయగలడని భావించి ఫైనల్ గా అతన్నే తెలుగు వెర్షన్ కి ఎంపిక చేసారు. ‘Mr నూకయ్య’ ఫేం అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి ‘123’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో పిక్సెల్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించే ఈ సినిమాలో అనీష అంబ్రోస్ హీరోయిన్ గా నటించనుంది.


