వెంకీ సినిమాలో తమిళ స్టార్ హీరో ?

వెంకీ సినిమాలో తమిళ స్టార్ హీరో ?

Published on Aug 17, 2018 12:17 AM IST

అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ ‘నేను లోకల్’ చిత్ర దర్శకుడు త్రినాథ రావు నక్కిన తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు. ఇక చిత్ర వర్గాల నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈచిత్రంలో తమిళ స్టార్ హీరో సూర్య కూడా నటించనున్నాడట.

కేవలం 20నిముషాలు మాత్రమే స్క్రీన్ ను షేర్ చేసుకోనున్న ఆయన పాత్ర సినిమాకు కీలకం కానుందట. ఇక సూర్య కూడా ఈచిత్రంలో పోలీస్ పాత్రలో నటించనున్నారు. మరి ఈ వార్తలు నిజమోకాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈచిత్రం యొక్క వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇక వెంకటేష్ ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ఆయన బాబీ దర్శకత్వంలో నాగ చైతన్య తో కలిసి మరో మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు