తెలుగులో హీరోగా రానున్న తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్

trisha-leda-nayatara
టెక్నికల్ ఫీల్డ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత నటులుగా, హీరోలుగా మారిన వారు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్డం తెచ్చుకున్న వారు హీరోలుగా మారడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తమిళంలో, తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరున్న యంగ్ అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్. తెలుగులో జివి ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట సినిమాలు మ్యూజికల్ గా హిట్స్ అయ్యాయి. ఈ ఏడాది తమిళంలో వచ్చిన ‘డార్లింగ్’ సినిమాతో జివి ప్రకాష్ కుమార్ హీరోగా మారాడు.

జివి ప్రకాష్ కుమార్ హీరోగా చేసిన రెండవ సినిమా ‘త్రిష ఇల్లన నయనతార’. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో తెలుగులో కూడా హీరోగా పరిచయం కావాలని నిర్ణయించుకున్న జివి ప్రకాష్ కుమార్ ‘త్రిష్ లేదా నయనతార’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. అందులో భాగంగానే ఈ రోజు జివి ప్రకాష్ కుమార్ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ లో భాగంగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. స్టూడియో గ్రీన్ వారు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. జివి ప్రకాష్ సరసన ఆనంది, మనీషా యాదవ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఆదిక్ రవిచంద్రన్ డైరెక్టర్. జివి ఫస్ట్ హిట్ అందుకున్న డార్లింగ్ సినిమా తెలుగులో హిట్ అయిన ‘ప్రేమకథా చిత్రమ్’ కి రీమేక్.

మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ తమిళంలో హిట్స్ అందుకొని ఆ తర్వాత తెలుగులో హిట్స్ అందుకున్న జివి ప్రకాష్ కుమార్ ఇదే ఫాములాని తను హీరోగా చేసిన సినిమాకి కూడా ఫాలో అవుతున్నాడు. మొదటి సినిమాతో తమిళ్ లో హిట్ కొట్టి సెకండ్ సినిమాతో తెలుగు, తమిళ్లో మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మరి మ్యూజిక్ డైరెక్టర్ లానే హీరోగా కూడా సక్సెస్ అవుతాడేమో చూడాలి.

Exit mobile version