చివరి నిమిషంలో బిగిల్ కి ఫేవర్ చేశారు గా

Published on Oct 25, 2019 9:27 am IST

బిగిల్ మూవీ నేడు భారీగా తెలుగు తమిళ భాషలలో విడుదల అవుతుంది. అట్లీ విజయ్ లది సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా బిగిల్ మూవీ ప్రీమియర్ షోస్ అనుమతించబోమంటూ తమిళనాడు ప్రభుత్వం రెండు రోజుల ముందు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని అతిక్రమించిన ఎవరైనా కఠిన చర్యలకు బాధ్యులు అవుతారని నిర్మాతలకు, థియేటర్ యజమానులకు హెచ్చరికలు పంపింది. దీనితో తమిళనాడులో బిగిల్ ప్రదర్శన 25వ తేదీన మార్నింగ్ షో నుండి మాత్రమే ప్రారంభం అవుతుంది. అలాగే రోజుకు కేవలం నాలుగు షోలు మాత్రమే అనుమతిస్తారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బిగిల్ మూవీ ఈ నిర్ణయంతో ఓపెనింగ్ కలెక్షన్స్ కోల్పోయే అవకాశం కలదని నిర్మాతలు తలలుపట్టుకున్నారు.

కాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ తమిళనాడు గవర్నమెంట్ బిగిల్ ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇవ్వడం జరిగింది. దీనితో ఉపిరి పీల్చుకున్న నిర్మాతలు తమిళనాడు సీఎం మరియు మినిస్టర్ కాదంబర్ రాజు కి కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ మూడు విభిన్న పాత్రలలో నటించిన ఈచిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. నయనతార ఈ చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :

More