
బాల నటుడిగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత హీరోగా మారి పదేళ్ళ మైలురాయిని చేరుకున్నాడు యువ హీరో తనీష్. నటుడిగా 20 యేళ్ళు, హీరోగా పదేళ్ళ ప్రయాణం పూర్తి అయిన తరుణంలో తన వెన్నంటి నిలిచిన మీడియా తో ముచ్చటించారు తనీష్.
ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ బాలనటుడిగా రోజుకి మూడు షిప్ట్ లు చేసే వాడిని, నా కెరియర్ కోసం మా నాన్నగారు తన జీవితంలో అతి పెద్ద రిస్క్ చేసి తన జాబ్ కి వాలెంటరీ రిటైర్మెంట్ ఇచ్చారు. తర్వాత చాలా కష్టాలు చూసాం. కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాం. కానీ నా మీద నమ్మకం, ధైర్యం ఎప్పుడూ నా తల్లిదండ్రులు కోల్పోలేదు. నచ్చావులే సినిమా టైం లో నాకు మరొక సినిమా హీరోగా ఆఫర్ వచ్చింది. కానీ ఆ కథ అంతగా నచ్చలేదు. ఆ టైం లో నచ్చావులే సినిమా ఆడిషన్స్ కి అటెండ్ అయ్యాను. ‘దర్శకుడు రవిబాబు గారు నన్ను చూసిన వెంటనే నువ్వు తగ్గితే అప్పుడు ఆలోచిస్తా’అన్నారు. పదిహేను రోజుల్లో పదికేజీలు తగ్గిన తర్వాత తర్వాత రవిబాబు గారిని కలిస్తే ‘ రేపు సినిమా ఓపెనింగ్ వచ్చేయ్’అన్నారు. సినిమా రిలీజ్ రోజు ప్రెండ్స్ తో థియేటర్ కి వెళ్ళాను. బయటికి వచ్చి చూస్తే సినిమా పెద్ద హిట్ అనే రిపోర్ట్ తెలిసింది. ఈ అవాకాశం ఇచ్చిన రామోజీ రావు గారికి రవిబాబు గారికి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. బాల నటుడిగా 60కి పైగా సినిమాలు, హీరోగా 20 సినిమాలు కంప్లీట్ చేసాను.
నా ఈ జర్నీ లో ముగ్గురికి థాంక్స్ చెప్పాలి. మొదటి గా మీడియా నా ప్రతి సందర్భంలో నా వెంట ఉంది. రెండు నా తల్లిదండ్రులు, తర్వాత ప్రేక్షకులు. ఈ ముగ్గురు నా గుడ్ అండ్ బ్యాడ్ లో నావెంట ఉన్నారు. నా కెరియర్ లో హిట్స్ ఉన్నాయి ప్లాప్స్ ఉన్నాయి. కానీ నా జర్నీ మాత్రం కొనసాగుతుంది. నేను తెలియక చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. వాటిలో ఒకటి మీడియా కి దూరంగా ఉండటం. అందుకే ఈ ప్రత్యేక సందర్భాన్ని మీడియాతో పంచుకోవాలనిపించింది. బిగ్ బాస్ నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ప్రతి ఇంటిలోకి తీసుకువెళ్ళింది. ఆ షో నాకు చాలా ఎమోషనల్ మూమెంట్స్ ని మిగిల్చింది. రంగు తర్వాత మరో కథను ఫైనలైజ్ చేసాను. మిగిలిన వివరాలు తర్వలో అందిస్తాను. ఈ పదేళ్ళ జర్నీలో నాకు తోడుగా నా తమ్ముళ్ళు కుష్వంత్, వంశీ ఉన్నారు. అలాగే మీడియా కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .