గేమ్ డెవలపర్ పాత్రలో తాప్సి !

Published on Dec 17, 2018 8:58 am IST

తెలుగు , తమిళ , హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపొయింది హీరోయిన్ తాప్సీ. తాజగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘గేమ్ ఓవర్’. ఈచిత్రంలో తాప్సీ వీడియో గేమ్ డెవలపర్ పాత్రలో నటిస్తుంది. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈచిత్రాన్ని ‘మాయ’ ఫేమ్ అశ్విన్ శరవణ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుది. త్వరలోనే ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలకానుంది.

ఈచిత్రం పాటు తాప్సీ ప్రస్తుతం మరో మూడు హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఇక ఈ ఏడాది తాప్సీ 5సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చింది. వాటిలో ‘ముల్క్ , సూర్మ’ మంచి విజయాలను సాధించాయి.

సంబంధిత సమాచారం :