ప్రముఖ హీరోయిన్ తాప్సీకి హైదరాబాద్‌లో మేనేజర్ ఎవరూ లేరా..? ప్రస్తుతం ఈ ప్రశ్న మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మరియు చెన్నై నగరాలలో ఏవైనా కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించేవారు, సంప్రదించడానికి ప్రయత్నించే వారు డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ చేయండి. అక్కడ స్థానిక వ్యక్తులు ఎవరూ నా వ్యవహారాలు చూడడం లేదు అని తాప్సీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
తాప్సీ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆమె పేరు చెప్పి, ఇక్కడ ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నారా..? అనే అనుమానం ఫిల్మ్ నగర్ వర్గాలలో కలుగుతుంది. గతంలో హన్సిక కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కొందరి మేనేజర్ల వ్యవహార శైలి హీరోయిన్లకు నచ్చడం లేదని సమాచారం. హీరోయిన్ల పేరును దుర్వినియోగం చేస్తుండడంతో ఇలా తమనే సంప్రదించండి అని నేరుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
Embed Tweet :
For all the people in Hyderabad and Chennai who are trying to contact me for various events, contact me directly. No local person handles me
— taapsee pannu (@taapsee) January 12, 2015
