‘త్రివిక్రమ్’ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ ?

Published on May 30, 2020 7:11 pm IST

ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ గాసిప్ ఏమిటంటే, ఈ చిత్రంలో డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. అయితే సినిమా మొత్తం తారక్ డబుల్ రోల్ లో కనిపిస్తాడా లేక ప్లాష్ బ్యాక్ లో సెకెండ్ రోల్ వస్తోందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట.

కాగా ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇక మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More