జక్కన్న నుంచి తారక్ ఫ్యాన్స్ దీని కోసమే ఎదురు చూపులు.!

జక్కన్న నుంచి తారక్ ఫ్యాన్స్ దీని కోసమే ఎదురు చూపులు.!

Published on May 17, 2020 1:23 AM IST

NTR Rajamouli

ఈ మే నెల ప్రారంభంతోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమను టన్నుల్లో చూపించారు. ఈ నెల 20 వ తారీఖున రాబోతున్న తారక్ పుట్టిన రోజు కోసం వీరు సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. అయితే అదే రోజు కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అదే రోజున రాజమౌళి ఇవ్వబోయే ట్రీట్ కోసం ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రం నుంచి అల్లూరి సీతారామరాజుగా చరణ్ ఎలా ఉంటారో రాజమౌళి చూపించేసారు. కొమరం భీం గా తమ అభిమాన నటుడు ఎలా ఉంటారో అని తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే “భీం ఫర్ రామరాజు” టీజర్ కంటే ఇది మరింత పవర్ ఫుల్ రాజమౌళి చేసి తమని మెప్పించాలని తారక్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ అభిమానులు తమ అంచనాలు జక్కన్న ఎక్కడా తగ్గించకుండానే తమ ట్రీట్ ను సిద్ధం చేసి ఉంటారని ఆశిస్తున్నారు. మరి రాజమౌళి ఏం ప్లాన్ చేసారో తెలియాలి అంటే మే 20 వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు