ఇంట్రెస్టింగ్..”వకీల్ సాబ్” చూసి పవన్ ను హగ్ చేసుకున్న తారక్.!

Published on Apr 14, 2021 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రం యూనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని మొదటి రోజు నుంచి దూసుకెళ్తుంది. ఒక్క ఆడియెన్స్ నుంచి మాత్రమే కాకుండా సినీ వర్గాల్లో కూడా పవన్ తోటి స్టార్ హీరోలు సహా పవన్ కం బ్యాక్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ముఖ్యంగా పవన్ మరియు ప్రకాష్ రాజ్ నటనలు సహా ముగ్గురు కీలక పాత్రధారులు నివేతా, అంజలి, అనన్య నాగళ్ళ ల నటనకు కూడా మంచి కితాబిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇపుడు బయటకు వచ్చింది. ఈ చిత్రంలో పవన్ కు ఆపోజిట్ గా నటించిన ప్రకాష్ రాజ్ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరికీ మంచి కిక్ ఇచ్చే నిజాన్ని వెల్లడించారు.

వకీల్ సాబ్ చూసిన చాలా మంచి హీరోలు మెచ్చుకున్నారని చెబుతూనే తారక్ వకీల్ సాబ్ కూడా పవన్ ను హగ్ చేసుకున్నారన్న విషయాన్ని వెల్లడించారు. అయితే తారక్ వకీల్ సాబ్ చూసారన్న విషయం తాను చెప్పకపోయినా ప్రకాష్ రాజ్ మూలాన బయటకు వచ్చింది. దీనితో ఈ వార్త విన్న ఇరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఈ ఆ వీడియోతో తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :