మన దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు తన దర్శకుడు జక్కన్నతో తీస్తున్న “RRR”తో పాన్ ఇండియన్ లెవెల్లో కూడా తన దమము చూపేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే తారక్ కు మన దేశంలో కాకుండా అతని డాన్సులకు జపాన్ దేశంలో ఒక సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఓ జంట అయితే తారక్ మాస్ సాంగ్స్ కు దుమ్ము దులిపేస్తారు.
అలాగే ఆ మధ్య మధ్యలో కంత్రి, అశోక్ సినిమాలలో పాటలకు గాను తారక్ ను ఇమిటేట్ చేసి అదరగొట్టారు. అయితే ఇప్పుడు అదే జంట తారక్ “నాన్నకు ప్రేమ”తో సినిమాలో చేసిన ఫాస్ట్ మూమెంట్ సాంగ్ “లవ్ దెబ్బ” సాంగ్ కు గాను అంతే ఎనర్జీతో తారక్ ను అలాగే రకుల్ ను మ్యాచ్ చేసే చేశారు. దీనితో వీరి సాంగ్ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి మాత్రం తారక్ జపాన్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని ఓ రేంజ్ లో చాటుకుంటున్నారు.
jr.NTR-♪Love Dhebba Dance cover#JrNTR #インドダンス
↓full version↓https://t.co/WbmDkAGHzD pic.twitter.com/9ZCaurUezq
— HIROMUNIERU (@HIROMUNIERU1) December 12, 2020


