కండలు తిరిగిన తారక్ !
Published on Mar 13, 2018 4:26 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత చిత్రాలన్నింటిలోనూ మంచి ఫిట్నెస్ తోనే కనబడ్డప్పటికీ బాడీ బిల్డింగ్ పై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ద పెట్టలేదాయన. అసలు సినిమాల పరంగా ఆ అవసరం కూడ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం తారక్ పూర్తిస్థాయి బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సిక్స్ ప్యాక్ అనొచ్చు. త్వరలో ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టనున్నారు.

ఈ చిత్రం కోసం కొన్ని నెలలుగా లాయ్డ్ స్టీవెన్స్ అనే ట్రైనర్ ను అపాయింట్ చేసుకుని మరీ కసరత్తులు చేస్తున్నాడు. ట్రైనర్ స్టీవెన్స్ ఇది వరకే తారక్ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను వదలగా ఇప్పుడు తారక్ శరీర సౌష్టవం క్లారిటీగా కనిపిస్తున్న ఫోటో ఒకదాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అందులో ఎన్టీఆర్ చాలా ఫిట్ గా, గతంలో కంటే సాలిడ్ గా కనిపిస్తున్నాడు.

స్వతహాగానే నటనతో మెప్పించే తారక్ సిక్స్ ప్యాక్ లాంటి అదనపు హంగుల్ని కూడ కనబరిస్తే అభిమానులకు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇకపోతే ఇటీవలే రాజమౌళి మల్టీస్టారర్ కోసం టెస్ట్ లుక్ కు వెళ్లొచ్చాడు తారక్.

 
Like us on Facebook