నారా రోహిత్ తో ఢీ కొట్టనున్న తారకరత్న

నారా రోహిత్ తో ఢీ కొట్టనున్న తారకరత్న

Published on Nov 10, 2015 8:26 AM IST

nara-rohith-tarak-ratna

కెరీర్ ప్రారంభం నుంచే ఒకదానితో ఒకటి పొంతన లేకుండా డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ వస్తున్న నారా వారి అబ్బాయి నారా రోహిత్ ఈ ఏడాది ‘అసుర’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నారా రోహిత్ కమిట్ అయిన సినిమాలు ఒక అరడజనుకు పైగానే ఉన్నాయి. రీసెంట్ గా కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో చేసిన ‘తుంటరి’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసాడు. ఇది ఫినిష్ చెయ్యగానే పవన్ సాధినేని డైరెక్షన్ లో ‘సావిత్రి’ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ప్రస్తుతం సావిత్రి సినిమా షూటింగ్ నిరవధికగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఇటీవలే శ్రీవాస్ దగ్గర అసోషియేట్ గా పనిచేసిన ప్రదీప్ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాని వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించనున్నాడు. కథని ఓకే చెయ్యడమే కాకుండా ఆ సినిమాకి ‘రాజా చేయివేస్తే’ అనే టైటిల్ ని ఖారారు చేసారు. తాజాగా ఈ సినిమాలో నారా రోహిత్ ని ఢీ కొట్టే మెయిన్ విలన్ పాత్రకి నందమూరి తారకరత్నని ఫైనల్ చేసారు. హీరో పాత్రకి తగ్గట్టుగానే విలన్ పాత్ర కూడా పవర్ఫుల్ గా ఉంటుందని తారకరత్నని సెలక్ట్ చేసారు. గతంలో తారకరత్న ‘అమరావతి’ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించి మెప్పించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మిడిల్ లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇవి కాకుండా ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘పండగల వచ్చాడు’, ‘జో అచ్యుతానంద’ మరియు ‘వీరుడు’ అనే సినిమాలను కూడా లైన్లో పెట్టాడు నారా రోహిత్.

తాజా వార్తలు