సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘టాక్సీవాలా’ ఇటీవల విడుదలై హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఇక మొదటివారంలో నే ప్రాఫిట్స్ ను రాబట్టిన ఈ చిత్రం రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన అదే జోరును కొనసాగిస్తుంది. నిన్న విడుదలైన చిత్రాలు చిన్న చిత్రాలు కావడం పైగా ఏ ఒక్కటి పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోవడంతో టాక్సీవాలా కు బాగా కలిసొచ్చింది.
ఈచిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లు 80శాతం ఆక్యుపెన్సీ ని రాబట్టుకుంటున్నాయి. ఇక 2.0 విడుదలైయ్యే వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇదే హవాను కొనసాగించనుంది.


