హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన టాక్సీవాలా !

‘గీత గోవిందం’తో 100కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఆతరువాత ‘నోటా’ తో నిరాశపరిచాడు. అయితే తాజాగా ‘టాక్సీవాలా’ చిత్రం తో మళ్ళీ సక్సెస్ బాట పట్టాడు. విజయ్ నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతూ చాలా ఏరియాల్లో లాభాల బాట పట్టింది.

ఇక ఈచిత్రం అటు యూఎస్ లోకూడా మంచి వసూళ్లను రాబడుతూ హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. ఫ్రీజీ ఫ్రేమ్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈచిత్రం అక్కడ ఇప్పటివరకు 5లక్షల 19వేల డాలర్ల వసూళ్లను రాబట్టింది. హార్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వం వహించాడు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈచిత్రంలో మాళవిక నాయర్ ముఖ్య పాత్రలో నటించింది.

Exit mobile version