జూన్ రెండవ సగంలో విడుదలకానున్న ‘టాక్సీవాలా’ !

జూన్ రెండవ సగంలో విడుదలకానున్న ‘టాక్సీవాలా’ !

Published on May 21, 2018 2:46 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టాక్సీవాలా’. ఆరంభం నుండి కొంత ప్రత్యేకమైన బజ్ ను కలిగి ఉన్న ఈ చిత్రం ఈ నెలలోనే విడుదలవ్వాలి.. కానీ కొన్ని నిర్మాణాంతర కార్యక్రమాలు పెడింగ్ ఉండటంతో వాయిదాపడింది. ప్రస్తుతమా పనులన్నీ చివరి దశకు చేరుకోవడంతో చిత్రాన్ని జూన్ రెండవ సగంలో విడుదలచేయాలని నిర్మాతలు నిర్ణయించారు.

కనుక జూన్ 15 నుండి 22 ల మధ్య సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ బ్యానర్లు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్కెఎన్ నిర్మిస్తుండగా మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఉండబోతున్న ఈ చిత్రం యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు