
విజయ్ దేవరకొండ నటించిన నూతన చిత్రం టాక్సీవాలా రిలీజ్ కు ఇబ్బందులు ఎదరువుతూనే ఉన్నాయి . ఈ సినిమా మే నెల లోనే విడుదలకావల్సి ఉండగా అనివార్య కారణాలతో ఈ నెల చివరి వారంలో రిలీజ్ కానుందని ప్రకటించారు . కానీ ఇప్పుడు ఆ సమయానికి కూడా విడుదలకు నోచుకోవట్లేదని జులై చివర్లో రానుందని సమాచారం.
ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతోనే సినిమా విడుదలకు ఆలస్యం అవుతుందని అంటున్నారు . యు వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వం వహించాడు మరి ఈ సినిమా విడుదల తేదీని తొందర్లోనే చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి . అర్జున్ రెడ్డి సినిమాతో విజయం సాధించి స్టార్ హీరోల జాబితాలో చేరిన విజయ్ దేవరకొండ నటించిన ఈ టాక్సీవాలా చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి.