టాక్సీవాలా విడుదలలో స్వల్ప మార్పు !

టాక్సీవాలా విడుదలలో స్వల్ప మార్పు !

Published on Nov 4, 2018 9:51 AM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ ఒక్కరోజు ఆలస్యంగా విడుదల కానుంది. మొదట ఈచిత్రాన్ని నవంబర్ 16న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే రోజున రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ విడుదలవుతుండడంతో టాక్సీవాలా ను నవంబర్ 17న విడుదల చేస్తున్నట్లుగా కొద్దీ సేపటి క్రితం అధికారంగా ప్రకటించారు.

నూతన దర్శకుడు రాహుల్ సంక్రుత్యాన్ తెరకెక్కించిన ఈచిత్రంలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు