హాఫ్ మిలియన్ మార్క్ చేరువలో టాక్సీవాలా !

హాఫ్ మిలియన్ మార్క్ చేరువలో టాక్సీవాలా !

Published on Nov 19, 2018 1:00 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ ను రాబడుతుంది. ఈచిత్రం మొదటి రోజే 10.5కోట్ల వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ కావడం విశేషం.

ఇక ఈ చిత్రం అటు యూఎస్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. రెండు రోజులకు ఈ చిత్రం అక్కడ 4లక్షల 20వేల డాలర్ల వసూళ్లను రాబట్టి హాఫ్ మిలియన్ మార్క్ కు చేరువైయింది.

హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రాహుల్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఇక ‘గీత గోవిందం’ తరువాత విజయ్ ఈచిత్రంతో ఈఏడాదిలో రెండో విజయాన్ని అందుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు