‘టాక్సీవాలా’ టీజర్ వాయిదాపడింది !


విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘టాక్సీవాలా’ టీజర్ ను ముందుగా ఏప్రిల్ 17న అనగా రేపు విడుదలచేస్తామని చిత్ర యూనిట్ రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ తేదీని వాయిదావేసి ఏప్రిల్ 18న సాయంత్రం 6 గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ లు విజయ్ కు జోడీగా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి జాక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తుండగా సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.