‘సీత’ తో తేజా లేడీ ఓరియెంట్…?

Published on Jun 17, 2019 2:44 pm IST

తెలుగు పరిశ్రమలో దర్శకుడు తేజ హీరోయిన్ కాజల్ మంచి స్నేహితులు. కాజల్ ని మొదటగా “లక్ష్మీ కళ్యాణం” మూవీ తో తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ కావడంతో ,ఆమె ఆయన పట్ల ప్రత్యేక అభిమానం కలిగిఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమాగా వచ్చి భారీ అంచనాల మధ్య విడుదలైన “సీత” అనుకున్నంత గా విజయం సాధించలేదు.కానీ సీత పాత్ర విషయంలో నటన పరంగా కాజల్ కి,దర్శకత్వం పరంగా తేజా కి మంచి మార్కులే పడ్డాయి.

ఐతే మరో కొత్త సినిమా కోసం ఈ గురుశిష్యులు జతకట్టనున్నారని ఇండస్ట్రీ టాక్. తేజ తెరకెక్కించబోయే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ లో హీరోయిన్ గా తేజా కాజల్ ని ఎంపిక చేశారట. దీనికి కాజల్ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకెళ్లే అవకాశం ఉందని టాక్. సీత మూవీలో రాముడిని అపహరించిన సీత లా నెగెటివ్ షేడ్స్ లో కాజల్ ని చూపించిన తేజా ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఎలా చూపిస్తారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

X
More