‘చాణక్య’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

‘చాణక్య’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Sep 8, 2019 11:02 AM IST

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో వస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను అండ్ టైంను ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 9వ తేదీన సాయంత్రం నాలుగు గంటల ఐదు నిముషాలకు టీజర్ విడుదల కానుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు. కాగా గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరి గోపీచంద్ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు