బాలయ్య రోల్ పై ఫుల్ క్లారిటీ..ఇక రచ్చే..!

బాలయ్య రోల్ పై ఫుల్ క్లారిటీ..ఇక రచ్చే..!

Published on Jun 10, 2020 7:43 AM IST

Balakrishna

బాలయ్య తన పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన లేటెస్ట్ మూవీ టీజర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్ లా ఉంది. ఒక నిమిషానికి పైగా ఉన్న టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో రెచ్చిపోయారు. ముఖ్యంగా పంచ కట్టులో బాలయ్య లుక్ కేకగా ఉంది. వైట్ అండ్ వైట్ లో బాలయ్య చక్కగా సరిపోయారు.

ఈ నేపథ్యంలో బాలయ్య పాత్రపై అప్పుడే ఉహాగానాలు మొదలయ్యాయి. బాలయ్య ఎప్పటిలాగే రెండు భిన్న పాత్రలలో నటిస్తారట. అందులో ప్రస్తుతం విడుదల చేసింది రైతు పాత్ర అని తెలుస్తుంది. బాలయ్య ఈ పాత్రలో రైతుగా, ఊరి పెద్దగా హుందాతనం తో కూడిన పాత్ర చేస్తున్నారట. ఊరిలో అందరి తలలో నాలుకగా, అన్యాయం పై యుద్ధం చేసేవాడిగా ఆయన పాత్ర ఉంటుందట. ఇక ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా, మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు