300 కోట్ల భారీ బడ్జెట్ సినిమా టీజర్ ఎప్పుడంటే

300 కోట్ల భారీ బడ్జెట్ సినిమా టీజర్ ఎప్పుడంటే

Published on Jul 2, 2019 12:00 AM IST

తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విక్రమ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘మహావీర్ కర్ణ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని న్యూయార్క్ నగరానికి చెందిన యునైటెడ్ ఫిలిమ్స్ కింగ్డమ్ సంస్థ నిర్మిస్తోంది. ఆర్.ఎస్. విమల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో విక్రమ్ కర్ణుడి పాత్రలో నటిస్తున్నారు.

ఇటీవలే సినిమా యొక్క ముఖ్యమైన షెడ్యూల్ హైదాబారాబాద్లో జరిగింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ టీజర్ సిద్ధం చేసే పనిలో ఉందట. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇండియాలోనే అత్యంత ఖరీదైనదిగా చెప్పబడుతున్న ఈ ప్రాజెక్టును సుమారు 32 అంతర్జాతీయ భాషల్లో విడుదలచేయనున్నారు. అలాగే ఏ భారతీయ చిత్రానికి దక్కనంత భారీ రిలీజ్ ఈ సినిమాకు దక్కనుందట. ఇందులో స్వదేశీ నటులతో పాటు విదేశీ నటులు కూడా పెద్ద సంఖ్యలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు