‘పెంగ్విన్’ టీజర్ తో ఆకట్టుకుంటున్న మ‌హాన‌టి !

Published on Jun 8, 2020 12:03 pm IST

మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన ‘పెంగ్విన్’ చిత్రం నుండి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. సప్సెన్స్ థ్రిల్లర్ లా సాగిన ఈ టీజర్ లో కీర్తి సురేష్ నటనతో పాటు విజూవల్స్, చివరి షాట్ లో చార్లీ చాప్లిన్ గెటప్ లో రివీల్ అయిన షాట్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక కీర్తి సురేష్ కూడా కొత్తగా కనిపించింది.

కాగా ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా జూన్ 19న విడుద‌ల కాబోతుంది పెంగ్విన్. ఇదిలా ఉంటే ఈ సినిమా టాట్రైలర్ జూన్ 11న విడుదల కానుంది.

అమెజాన్ ప్రైమ్. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకం పై ద‌ర్శ‌కుడు, నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈశ్వ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More