ఆన్లైన్ చాటింగ్, బ్లైండ్ డేటింగ్ నేపథ్యంతో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘వేగ లీల’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఘంటసాల నాగ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ లక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్, జశ్రీత ప్రొడక్షన్స్ పతాకాలపై సాయి కుమార్ మేడి, వేణు జయ నిర్మిస్తున్నారు. ఓ సినిమా నిర్మాణం చుట్టూ తిరిగే కథాంశంతో పాటు సస్పెన్స్ అంశాలతో టీజర్‌ను ఆకట్టుకునేలా రూపొందించారు.
ఈ చిత్రంలో జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్, ఆదర్శ్ పూంధీర్, సాయి ఆస్రిత్, రామ్ భూపతి, దీపకృతి రాథోడ్, అశోక్ వర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక వర్గానికి వస్తే, జి.వి. మరియు పవన్ చరణ్ సంగీతం అందిస్తుండగా, దిలీప్ కుమార్ చిన్నయ్య సినిమాటోగ్రఫీ, దిలీప్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణ అనంతర (పోస్ట్ ప్రొడక్షన్) కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్లు వేగవంతం చేసి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.
