సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘ఆగడు’ సినిమా సెకండ్ టీజర్ ను ఈ రోజు ఉదయం విడుదల చేశారు. ఫస్ట్ టీజర్ తరహాలో ఈ టీజర్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు శ్రీను వైట్ల మహేష్ చేత సూపర్బ్ కామెడీ టైమింగ్ లో పంచ్ డైలాగులను చెప్పించారు.
>డిక్కీ బలసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తోడ కొట్టిందంట…
>నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ కాదు ఫైటర్ ని. అయ్యిబాబోయ్ నాకు కూడా సినిమా డైలాగులు వచ్చేస్తున్నాయి.
అంటూ మహేష్ చెప్పిన డైలాగులు అభిమానుల చేత చప్పట్లు కొట్టిస్తున్నాయి. ‘ఆగడు’ ఫస్ట్ టీజర్ లో కూడా మహేష్ పంచ్ డైలాగులతో సందడి చేశారు. తాజా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. సర్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలయినట్టే అంటూ వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్ సినిమాలో యాక్షన్ కి లోటు లేదు అనే హింట్ ఇచ్చింది.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. మహేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించగా శృతి హాసన్ ప్రత్యేక గీతంలో నటించింది. త్వరలో ఈ సినిమా ఆడియో విడుదల కానుంది.
‘ఆగడు’ సెకండ్ టీజర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


